ఎదుట నిలిచి పిలిచినా
ఆరిపోని అడుగుల గురుతులలో
మాసిపోని నీడల అడుగుజాడలలో
మారిపోని మనసు లోతుల్లో
ఏదో జ్ఞాపకం
వెంటాడుతూనే ఉంది

వీడిపోని నీ నీడ సాక్షిగా
వాడిపోని నీ తలంపుల సాక్షిగా

నేనింకా సజీవంగానే ఇలా మిగిలి ఉన్నా
కలలా అయినా వచ్చి కనికరిస్తావని
నిజములా నా తోడుంటావని

ఎన్ని జన్మలైనా వేచి చూస్తూనే ఉంటా
నీకోసం....... నీ ప్రేమ కోసం


0 Comments