#ఆంజనేయ_స్వామి_తీసుకువచ్చిన_సంజీవని

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి మూర్చిల్లిన లక్షణుడిని బ్రతికించడానికి సంజీవని మూలిక అవసరమవుతుంది.. ఈ మూలిక హిమాలయ పర్వతాలలో లభిస్తుందని హనుమంతుని ఆ పర్వతంలోని ఆ మూలికను తెమ్మని చెప్పి పంపుతారు…హిమాలయాలకు లంఘించిన హనుమంతునికి అక్కడి ప్రతి మొక్కా సంజీవని లాగానే తోస్తుంది… ఏమి చేయాలో అర్థం కాదు.. ఒక ప్రక్కన చూస్తే లక్ష్మణ స్వామి సకాలంలో మూలికను అందించలేదంటే తమకు దక్కడు… ఒకవేళ వేరే మూలికను తీసుకువచ్చినా ప్రయోజనం లేదు…ఇలాంటి తర్క మీమాంసలో మన ఆంజనేయుడు మొత్తం సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తన వెంట తీసుకువెళతాడు… తిరిగి లంకకు మొత్తం పర్వతంతో సహా వచ్చిన హనుమంతుని చూసి అసుర గణం, వానర గణం..శ్రీరాముల వారు ఆశ్చర్య పోతారు… హనుమంతుని స్వామి భక్తి అటువంటిది మరి… అందుకే ఆయన శ్రీరాముని ప్రియభక్తులయ్యారు… ఈ పర్వతం ఇంకా మన మధ్యే ఉంది.. అవును..ప్రస్తుతం ఇంకా ఇది శ్రీలంకలో చెక్కు చెదరకుండా ఉంది… ఇక్కడ ఉన్న ఎన్నోవేల రకాల మూలికలను వాటి ఔషధ గుణాలను చూసి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి పరిశోధనకై వస్తారట… చుట్టు ప్రక్కలి గ్రామాల ప్రజలు తమకు ఏ వ్యాధి వచ్చినా ఇక్కడి మూలికలే ఉపయోగించుకుంటారట… ఈ పర్వతం మీద ఉన్న మొక్కలు శ్రీలంకలో మిగిలిన ఏ ఇతర ప్రాంతాలలోనూ దొరకదు… ఈ మొక్కల ఆనుపానులు హిమాలయాలలో మాత్రమే కనపడతాయని తెలిసింది… మన రామాయణము నిజమేనని చెప్పేదానికి ఇంత కంటే ఇంకేమి ఋజువులు కావాలి…!!!
No photo description available.
All reactions:
28
2 shares
Like
Comment
Share

Post a Comment

0 Comments