ఏమో ఈ వేళ....

💕🌾
ఏమైందో ఈ వేళ....
మది మోయలేని ఊహలకు
రెక్కలొచ్చి రివ్వున గాలిలో ఎగురుతూ
ఊహల ఊయలలో నను ఊపుతూ
ఏవో అందమైన తీయని💕🌾
తలపులను మది నుండి
ఎదకు చేరవేస్తుంటే....
ఎద భారమోపలేక.... 💕🌾
పెదాలపై చిరునవ్వు పూస్తుంటే
ఎపుడూ కలగని ఏదో అలజడి
మనసును మెలిపెడుతుంటే
నిన్న మొన్నటి వరకు💕🌾
నా చుట్టూనే వున్నావనుకుంటే
వెను తిరిగి చూస్తే
నీ జ్ఞాపకాల పూలను
ఎదపై రాల్చి వెళ్ళావు. 💕🌾
ఆ జ్ఞాపకాల చెట్టు ఊగినపుడల్లా
ఒక్కో జ్ఞాపకం ఎంత తీయనిదో
ఈ పూలు చెప్పకనే చెబుతుంటే
అపుడే నా మనసు
అంది అదే అదే ప్రేమని💕🌿
May be an image of 1 person and text that says '0 వెన్నెల్లో వెన్నెల్లోఆడపిల్ల ఆడైపెల్ల'
All reactions:
వెన్నెల్లో ఆడపిల్ల and 64 others


Post a Comment

0 Comments