🌺 ముప్పైమూడు కోట్ల దేవతలు ……..? మీకు తెలుసా?

 

🌺 ముప్పైమూడు కోట్ల దేవతలు ……..? మీకు తెలుసా?

🌺 ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే నిజంగా 33 కోట్లు కాదు! 🌺

అసలు విషయాన్ని చూసినపుడు మనం ఆశ్చర్యపోవచ్చు — వేదాలలో చెప్పబడే "ముప్పైమూడు కోట్ల దేవతలు" అంటే 33,00,00,000 కాదు! సంస్కృతంలో "కోటి" అనే పదం విభాగం లేదా రకం అని అర్థం.
అంటే ఇక్కడ "33 రకాల దేవతల సమూహం" అనే అర్థం వస్తుంది.

బృహదారణ్యక ఉపనిషత్తు (3.9.1) ప్రకారం, 33 దేవతలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డారు:

దేవతా గణాలు మూడు రకాలు.

  • అష్ట వసువులు,
  • ఏకాదశ రుద్రగణాలు,
  • ద్వాదశ ఆదిత్య గణాలు.'
  • వీళ్ళు కాక అశ్వనీదేవతలు ఇద్దరు.

మొత్తం 33 మంది.

ఈ దేవతలే 3306 రూపాలలో విశ్వంలో వ్యాపించి ఉన్నారు అని వైదిక మంత్రాలలో పేర్కొనడం జరిగింది.

పురణాల ప్రకారం అష్ట వసు గణాలు: అనిలః, అనలః, ఆపః, ధర్మః., ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః. ఇందులో అనిలః అనగా వాయుదేవుడు. అనలః అనగా అగ్నిహోత్రుడు. ఆపః అనగా వరుణదేవుడు. ధర్మః అనగా ధర్మదేవుడు. అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు. వసు అనగా సంపద. అనగా సంపదను అనుగ్రహించెవారు. వీరు వరుసగా దిక్పాలకత్వం కూడా వహించారు.

  1. అగ్ని
  2. పృథివి
  3. వాయువు
  4. అంతరిక్షము
  5. ఆదిత్యుడు
  6. ద్యులోకము (Dyuloka – Heaven)
  7. చంద్రుడు,
  8. నక్షత్రాలు

అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది.

మరింకొక విధం:

మహాభారత ప్రకారం అష్ట అసువులు అంగా ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఓసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా వారికి వశిష్టాశ్రమంలో కామధేనువు కనబడింది. దానిని దొంగతనంగా తీసుకొని పోతారు. దివ్యదృష్టి ద్వారా వశిష్టుడు విషయం తెలుసుకొని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు.

వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది.

ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు-గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు.

అష్టవసువులు:

వరుణుడు

వృషభుడు

నహుషుడు

జయుడు

అనిలుడు

విష్ణువు

ప్రభాసుడు

ప్రత్యూషుడు

ఇంకొక విధం:

ఆపుడు

ధ్రువుడు

సోముడు

అధ్ర్వరుడు

అనిలుడు

ప్రత్యూషుడు

అనలుడు

ప్రభాసుడు

మరింకొక విధం:

ధరుడు

ధ్రువుడు

సోముడు

అహస్సు

అనిలుడు

అనలుడు

ప్రత్యూషుడు

ప్రభాసుడు

--- మహాభారతం - ఆది పర్వం - 66-18---

ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః

🔹 11 రుద్రులు

(ప్రాణాలు, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొదలైనవి)
🔹 12 ఆదిత్యులు

(ప్రతి మాసానికి ఓ ఆదిత్యుడు)
🔹 ఇంద్రుడు మరియు ప్రజాపతి (యజ్ఞాన్ని సూచించే దైవం)

🔹 8 వసువులు

అంతేకాదు, ఈ 33 దేవతలు ప్రాణ, అన్నం, వాయువు లాంటి సూత్రాత్మక శక్తుల రూపంగా కూడా వివరించబడ్డాయి.
👉 చివరకు ప్రాణమే అంతటినీ ఆవహించిన పరబ్రహ్మ తత్వంగా చెప్పబడింది.

📜 మంత్రం (ఆథర్వవేదము 10.7.13):

"యస్య త్రయస్త్రింశత్ దేవాః అంగే సర్వే సమాహితాః,
స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః"

🌾 అనువాదం:

"ఎవరిలో ఈ ముప్పైమూడు దేవతలూ అంతర్భూతమై ఉన్నారో,
ఆ స్కంభమనే ఆధారాన్ని చెప్పు —
అతను నిజంగా ఏ దేవుడయ్యే ఉండగలడు?
"

🧭 వివరణ:

  • త్రయస్త్రింశత్ దేవాః – ముప్పైమూడు దేవతలు (8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు మరియు ప్రజాపతి)
  • అంగే సమాహితాః – ఒకే సర్వశక్తిమంతుని అంగాల్లో, స్వరూపంలో అంతర్భవించేవారు
  • స్కంభం – స్కంభం అంటే ఆధారం, స్థంభం, సర్వప్రపంచాన్ని నిబ్బరంగా నిలిపే పరబ్రహ్మ తత్త్వం
  • కతమః స్విత్ దేవః సః? – ఆ దేవుడు ఎవరు? ఏ దేవుడి రూపమే ఈ అంతటినీ కలిగి ఉన్నాడు?

🕉️ తత్త్వార్థం:

ఈ మంత్రం ద్వారా వేదాలు మనకు స్పష్టంగా చెప్తున్నదేంటంటే:

ముప్పైమూడు దేవతలన్నీ వేరువేరు కాకుండా, ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలు మాత్రమే.
వారు అందరూ స్కంభము అనే పరబ్రహ్మమునందే సమ్మిళితమై ఉన్నారు.

ఇది అద్వైత తత్త్వం — అనగా,
👉 "అన్నీ దేవతలూ ఒకే పరబ్రహ్మ స్వరూపాలే."

🪔 సారాంశం:

మనమందరం పూజించే అనేక దేవతలూ చివరికి ఒకే శక్తి నుండి పుట్టినవే.
అదే ప్రాణశక్తి, స్కంభం, లేదా పరబ్రహ్మం అని వేదాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments