మహారాష్ట్రలోని వార్కరీ, కర్ణాటకలోని హరిదాసు లాంటి ఏకేశ్వరోపాసనా సంప్రదాయాలలో విఠోబా ప్రధాన దైవం. పండరీపురం లోని విఠల దేవాలయం ప్రధాన దేవాలయం. విఠోబా గురించిన కథలన్నీ ఆయన భక్తుడు పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఈ పుండరీకుడే విఠోబాను పండరీపురమునకు రప్పించాడని భక్తుల విశ్వాసం. మరి కొన్ని కథలు ఆయన భక్తకవులను ఎలా కరుణించాడనే సంఘటనలమీద ఉంటాయి. ఈ వార్కరీ సంప్రదాయానికి చెందిన వాగ్గేయకారులు మరాఠీ భాషలో విఠోబా దేవునిపై అభంగాలు అనే దివ్య సంకీర్తనలు రచించారు. కన్నడదేశంలోని హరిదాసు సాంప్రదాయంలో స్తోత్రాలు, మరాఠీ లోని హారతి పాటలు విఠోబా సాహిత్యంలో చెప్పుకోదగ్గవి. చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శాయనీ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశిలో విఠోబాకు విశేష పూజలు జరుగుతాయి.

విఠోబా పేరు మీద, చరిత్రమీద అనేక వాదోపవాదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అనేకమంది ఇండాలజిస్టులు (భారతదేశ చరిత్ర మీద పరిశోధన చేసేవారు) విఠోబా సాంప్రదాయం ఆరంభం కాకముందే ఇలాంటి విగ్రహాలు వివిధ కాలాల్లో వీరుడిగానూ, గ్రామదేవుడిగానూ, శివుడి యొక్క మరో స్వరూపంగానూ, జైన దేవుడిగానూ పూజలందుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. విఠోబా సాంప్రదాయం, ప్రధాన ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక వాదనలు జరుగుతున్నా 13వ శతాబ్దానికి మునుపే వాటి ఉనికిని నిర్థారించేందుకు ఆధారాలున్నాయి
విఠోబాకు సంబంధించిన పురాణ గాథలన్నీ ఎక్కువగా ఆయన భక్తుడైన పుండరీకుడి చుట్టూ తిరుగుతాయి. ఇంకా విఠోబాను వార్కరీ సాంప్రదాయానికి చెందిన భక్తకవులను కరుణించిన వాడిగా చిత్రీకరించబడి ఉంటాయి. పుండరీకుని గురించిన ప్రస్తావన స్కాంద పురాణంలోనూ, పద్మపురాణంలోనూ ఉంది. ఇంకా శ్రీధరుడు రాసిన పాండురంగ మహాత్మ్యం అనే గ్రంథంలోనూ, అదే పేరుతో ప్రహ్లాద మహారాజ్ రాసిన గ్రంథం లోనూ, అనేక భక్తకవులు రాసిన అభంగాలలోనూ పుండరీకుని ప్రస్తావన ఉంది.
పుండరీకుడసరిపోయింది
మూడు రకాలైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో రెండు స్కాంద పురాణంలో (1.34–67) పాఠ్యానికి దగ్గరగా ఉంటాయి. మొదటి కథ ప్రకారం పుండరీకుడు విష్ణు భక్తుడు. తల్లదండ్రుల సేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి గోవర్ధన గిరిధారియైన శ్రీకృష్ణుడు గోవులు కాచే గోపాలుడి రూపంలో పుండరీకుని కలవడానికి వస్తాడు. ఆయన రూపం దిగంబరమై, మకర కుండలాలతో, శ్రీవత్సముతో,తలపై నెమలి పింఛంతో చేతులు నడుము మీద పెట్టుకుని, గోవులను తరిమే కర్రను రెండు కాళ్ళ మధ్య పెట్టుకుని దర్శనమిచ్చాడు. పుండరీకుడు అతణ్ణి భీమానది ఒడ్డునే అదే రూపంలో ఉండిపొమ్మని కోరాడు. అలా ఉంటే ఆ స్థానం పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన నమ్మాడు. ఈ ప్రాంతమే ప్రస్తుతం బీమా నది ఒడ్డున ఉన్న పండరీపురం అని గుర్తించారు. ఇక్కడ కృష్ణుని వర్ణించిన విధానం పండరీపురంలోని విఠోబా విగ్రహం యొక్క రూపురేఖలతో సరిపోయింది,
రెండో కథ ప్రకారం విఠోబా పుండరీకుడికి ఐదేళ్ళ బాలకృష్ణుడిగా దర్శనమిచ్చాడు. ఈ కథ రెండు పురాణాల్లోనూ, ప్రహ్లాద మహారాజ్, తుకారాం లాంటి భక్తకవుల రచనల్లోనూ కనిపిస్తుంది.మిగతా కథ శ్రీధరుడి రచనలోనూ, కొంచెం మార్పులతో పద్మపురాణం లోనూ కనిపిస్తుంది. పుండలీకుడు ఒక బ్రాహ్మణుడు. తన భార్యపై ప్రేమానురాగాలతో వయసు మళ్ళిన తల్లిదండ్రులను సైతం విస్మరిస్తాడు. తరువాత కుక్కుట మహర్షిని కలిసిన తరువాత తన జీవన విధానంలో మార్పు వస్తుంది. తల్లిదండ్రుల సేవకై అంకితం చేస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి నిచ్చెలియైన రాధ ఒకసారి ద్వారకకు వచ్చి ఆయన ఒడిలో కూర్చుంటుంది. అక్కడే రుక్మిణి ఉన్నా ఆమె పట్టించుకోలేదు, అందుకు కృష్ణుడు కూడా అభ్యంతరపెట్టలేదు. అందుకు రుక్మిణి అలిగి కృష్ణుని వదిలి పండరీపురం సమీపంలోని దండీవనానికి వెళ్ళిపోతుంది. దాంతో కృష్ణుడు బాధపడి ఆమెను వెతుకుతూ దండీవనంలోని పుండలీకుడి ఇంటి దగ్గర ఆమెను కనుగొంటాడు. కొంతసేపు బుజ్జగించిన తరువాత రుక్మిణి మెత్తబడుతుంది. తరువాత పక్కనే కృష్ణుడు పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తుండగా చూస్తాడు. పుండలీకుడు ఒక రాయిని బయటికి విసిరి దాని మీద నిల్చోమంటాడు. కృష్ణుడు ఆ రాయి మీదనే నిల్చుని పుండలీకుడి కోసం ఎదురు చూస్తాడు. సేవలన్నీ చేసిన తరువాత పుండలీకుడు కృష్ణుని విఠోబా రూపంలోనూ, రుక్మిణిని రకుమాయి రూపంలోనూ ఆ ఇటుక మీదే నిలిచి భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండమని కోరతాడు.
ఇతర పురాణాల ప్రకారం విఠోబా తన భక్తులను రక్షించడానికి ఒక అంటరానివాడు (మహర్) గానూ, బ్రాహ్మణ యాచకుడిగానూ వస్తాడు.మహీపతి రాసిన పాండురంగ స్తోత్రంలో విఠోబా తన మహిళా భక్తులైన జానాబాయి లాంటి వారికి ఇల్లు శుభ్రం చేయడం, బియ్యం దంచడం లాంటి ఇంటిపనులలో ఎలా సహాయం చేశాడో వర్ణిస్తాడు. సేనా అనే క్షురకుడికి ఏ విధంగా సహాయం చేశాడో వర్ణిస్తాడు. బీదర్ రాజు చెప్పినప్పుడు సంస్థానానికి రాలేదని అతన్ని నిర్బంధించమని ఆదేశాలు జారీ చేస్తాడు. అప్పుడు సేనా విఠోబా పూజలో తలమునకలై ఉండటంతో విఠోబాయే సేనా రూపంలో రాజు దగ్గరికి వెళ్ళి అతణ్ణి రాజదండన నుంచి కాపాడతాడు, ఇంకో కథలో దామాజీ అనే రాజోద్యోగి కరువులో ఉన్న ప్రజలకు ధాన్యాగారం నుంచి దానం చేస్తాడు. అప్పుడు విఠోబా మారు వేషంలో ఒక సంచీలో బంగారంతో వచ్చి అతను దానం చేసిన ధాన్యానికి ఖరీదు చెల్లిస్తాడు.మరో కథలో గోరకుంభుడు అనే భక్తుడు విఠోబాలో పాటలలో లీనమై అడుసు తొక్కుతుండగా ఆడుకుంటూ వచ్చిన పిల్లవాడిని అందులో వేసి తొక్కేస్తాడు. అప్పుడు విఠోబా వచ్చి ఆ పిల్లవాడిని పునరుజ్జీవితుడిని చేస్తాడు.
All reactions:
105
4 comments
20 shares
Like
Comment
Send
Share

Post a Comment

0 Comments