షిర్డీకి ప్రాముఖ్యత రాక ముందు , "పండరీపురం" యాత్ర చాలా పవిత్రం గా భావించేవారు మరాఠీ భక్తులు..

. వారు మన పూర్వీకుల తిరుపతి యాత్రలా కఠోర దీక్షతో , చెప్పులు లేకుండా కాలినడకన, తెల్లని పంచే.,చొక్కా నెత్తిన తెల్లని టోపీతో కాషాయ జండా ధరించి , "పండరీపురం" పోయేవారు.
అది చాలా పవిత్ర క్షేత్రం.. ఇప్పుడు షిర్డీ క్షేత్రం ఆర్భాటాల ముందు "పండరీపురం" ప్రాముఖ్యత పోయింది ( పాండరంగ మహాత్యం సినిమా తీశారు) ..
మన తెలుగు రాష్ట్రాలలో చాలా పురాతన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, అలాగే పొరుగున మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ..
. మహారాష్ట్ర ,షిర్డీ యాత్ర కు వెళ్ళే వారు పండరీ పురం, త్రయంబకేశ్వరం, భవాని శంకరం, తుల్జాపురం భవాని, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం కూడా చేసుకొనే ప్రయత్నం చేయండి..
. ఔరంగజేబు ,బహమనీ సుల్తాన్ ల చేతిలో దెబ్బతిన్న ఈ దేవాలయాలు అహల్య బాయ్ హోల్కర్, శివాజీ సర్ధారులు పేష్వాలు పునఃరుధ్ధరించి పునఃర్ వైభవం తెచ్చారు ..
జయ పాండురంగ ప్రభో విఠలా జగదాధార జయవిఠలా..
#PostCourtesy : Yagna Narayana Kummamuru గారు
All reactions:
9
1 share
Like
Comment
Send
Share

Post a Comment

0 Comments