ఆలంపూర్ జోగులాంబ యొక్క జుట్టులో కూడా ఒక బల్లి...?
మనకి కంచిలోనే ఉన్న బల్లి గురించి మాత్రమే తెలుసు. కానీ నిజానికి ఆలంపూర్ జోగులాంబ యొక్క జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది. అలాగే ఒక తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయి. ఈవిడే నగ్నంగా ఒక శవం మీద కూర్చుని శవ సాధన చేస్తున్న 85 సంవత్సరాల వయో వృద్ధురాలుగా మహా మాంత్రికురాలిగా కనబడుతుంది.
నిజానికి ఈమె మనకి కపాలమోక్షం ఇచ్చే ఆది పరాశక్తి మాత యొక్క అంతిమ రూపం అన్నమాట. ఈ లెక్కన చూస్తే కపాలము ప్రేత శరీరము చేతపట్టుకొని ఆదిపరాశక్తి రూపం లో బ్రహ్మరంధ్ర దేవత అయితే దీని లోపల ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు అధిదేవతగా జోగులాంబ దేవి మాతగా ఉంటుంది.
నిజానికి ఈమె జోగులాంబ కాదు. యోగులాంబ. కాలక్రమేణా యోగులాంబ కాస్త జోగులాంబ అయినదని గ్రహించండి.
విచిత్రమేమిటంటే కంచి క్షేత్రములో రెండు బల్లులు ఉంటే ఈమె జుట్టులో ఒక బల్లి ఉంటుంది. నిజానికి ఈ అమ్మవారిని గృహ చండీమాతగా పిలవడం జరుగుతుంది.
పైగా ఈవిడ ఆగ్నేయ దిశలో ఉండి ఎల్లప్పుడు వేడి ఆవిర్లుతో తన శక్తితో చాలా ఉగ్రస్వరూపంగా కోర పళ్ళతో ఉంటుంది. ఆదిలో అమ్మవారి పన్ను పడిన చోట ఈమె ఉన్నదని గ్రహించండి.
ఇక ఈమె రూపం విషయానికి వస్తే ఈ విశ్వ సృష్టి అంతరించే సమయములో బల్లులు యొక్క సంయోగము వలన ఏర్పడిన బల్లి గ్రుడ్డు వలన ఈ విశ్వ సృష్టి జరుగుతుంది అని మనము తెలుసుకున్నాము కదా.
కంచి లో ఈ రెండు బల్లులు బతికే ఉండటానికి ఆధారమైన శక్తి మన జోగులాంబ ఇస్తోంది అన్నమాట.
ఎందుకంటే ఈమెకున్న దహనశక్తి వలన అత్యంతిక ప్రళయంలో నీరు ఆవిరిగా మారి పోవడం వలన బల్లి, తేలు, గబ్బిలం అనే మూడు జీవులు బ్రతికి పోతున్నాయి.
బ్రహ్మకపాలం కూడా ప్రాణశక్తితో మిగిలిపోతోంది. బల్లి కాస్త విష్ణు రూపం అన్నమాట. ఎందుకంటే బల్లి తాకటం అనేది మనం విష్ణుకంచిలోనే చూస్తాము.
అలాగే తేలు అనేది శివ రూపము అన్నమాట. ఎందుకంటే ఈయన కంఠమునందు విషమును ఉంచుకున్నాడు కదా. తేలులో విషం ఉంటుందని లోకవిదితమే కదా.
గబ్బిలం అనేది రక్తం త్రాగే క్షీరదమని లోకవిదితమే కదా. మరి అమ్మ వారు కూడా రక్త బీజధారియే కదా. గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట.
ఇక కపాలం అనేది బ్రహ్మదేవుడికి సంకేతము కదా. వీరభద్రుడు యొక్క కోపాగ్ని వలన తన పంచ ముఖాలలో ఒక ముఖము ఖండించడము అది కాస్తా బ్రహ్మకపాలంగా మారి ఆయన చేతికి అంటుకోవడం లోకవిదితమే కదా.
అంటే బల్లి, తేలు, గబ్బిలం, కపాలం అనేవి విష్ణువు శివశక్తి బ్రహ్మ స్వరూపం అని తెలుస్తోంది కదా. అంటే జోగులాంబ అమ్మవారి ఈ నాలుగు శక్తి స్వరూప దేవతలను తన జటాధారి యందు ఈ జీవ రూపాలలో ఉంచి పునఃసృష్టికి కారకము అవుతుందని తెలుస్తోంది కదా.
ఈ జీవులు కాస్త అర్ధ భాగాలుగా విభజన చెంది పునఃసృష్టిస్తున్నాయి.ఈ విశ్వమునందు సృష్టి స్థితి లయము లాస్యము చేస్తున్నామని అన్నమాట.
కారణం వీరికి ఉన్న బలహీనతలను దాటలేక పోవడమే అని గ్రహించండి. ఈ జీవులకు ఈ బలహీనత లేకపోతే జోగులాంబ చేతులలో వీటికి కపాలమోక్షం కలిగేది. కారణం ఈవిడ మాత్రమే శరీరములో జీవ కళను అనగా ప్రాణశక్తిని తగ్గించగలదు. తన దహన శక్తితో ప్రాణశక్తి కాస్త నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుంది అన్నమాట. కాకపోతే ఈ దహన శక్తికి ఈ జీవుల రూపంలో ఉన్న దైవ శక్తి స్వరూపాలు తట్టుకోలేక రక్షించమని అమ్మవారిని వేడుకొనేసరికి వీరికి ఉపశమనం కోసము విష్ణుమూర్తికి మేడి ఆకులు, శివుడికి బిల్వపత్రాలు, అమ్మవారికి సువాసన పువ్వులు, బ్రహ్మదేవుడికి నాదముతో ఉపశమనము ఇచ్చి వారిని తిరిగి పునర్జీవనం చేసి విశ్వ సృష్టిలో తిరిగి సృష్టి, స్థితి, లయ, లాస్యము ప్రక్రియలు చేసుకోమని అనుఙ్ఞ ఇవ్వడం జరుగుతోంది.
మేము ఎలాగైతే కామ గుణానికి, భయపడడానికి బలహీనపడితే ఈ త్రిమూర్తులు కాస్త సృష్టి యొక్క త్రికార్యాల బలహీనతకి గురి అయ్యారు. దానితో వీరందరు కూడా మా కథ లాగానే కంచికి చేరుకుని దేవికంచి, శివకంచి, విష్ణు కంచి ఏర్పరుచుకున్నారు. బ్రహ్మయ్య కు పూజించే అధికారం ఉంటే ఈ పాటికి ఎప్పుడో బ్రహ్మకు కూడా కంచి ఏర్పడేది. ఆయనకు అవకాశం లేదు. దానితో అది కాస్త బ్రహ్మరంధ్రముగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడినది.
0 Comments