పూర్వం ఒక అల్లుడుగారు ఉండేవారండి. ఒక దంపతులకి కుమార్తె, ఆ కుమార్తె గారు యవ్వనం వచ్చింది 18 ఏళ్ళ అయింది వివాహం చేశారండి.
వివాహం చేస్తే అల్లుడు ఎవరు వారో తెలుసండి? దూర ప్రాంతం, దూర ప్రాంతంలో సంబంధం. ఇక వివాహం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయినారండి అల్లుడుగారు.
ఒక నెల రోజులు అయిన తర్వాత దీపావళి వచ్చిందండి. దీపావళి నాడు ఏం చేస్తారో తెలుసా అండి, అల్లుడిని పిలుచుకుంటారండి. సామాన్యంగా పండగ కదండీ దీపావళి నాడు ఇదిగో కొత్తగా పెళ్లి అయిందని ఈ మామగారు ఉత్తరం రాశరండి అల్లుడుగారు దీపావళి దగ్గరికి వచ్చింది తమరు దయచేసి మా ఇంటికి రాండి అని ఆహ్వానించాడు.
అంటే ఆహ్వానించేటప్పుడు వారి ఉద్దేశం ఏమిటో తెలుసునా పండగ చూసి ఇంకొక రోజు ఉండి మహా ఉంటే ఇంకొక రోజు ఉండి వెళ్ళిపోతాడు అల్లుడుగారు అని అనుకున్నారండి. మామగారు ఉత్తరం రాసి రప్పించారండి సరిగ్గా దీపావళి వచ్చింది, అల్లుడు వచ్చాడండి.
దీపావళి నాడు అండి ఓహో వేడుకలు ఉత్సవాలు పిండి వంటలు ఇవన్నీ చేసుకున్నారండి. అల్లుడుగారు శుభ్రంగా భోజనం చేశారు మరుసటి రోజు కూడా ఉన్నాడండి అల్లుడు చక్కగా ఆ రోజు కూడా మంచి పిండి వంటలు అవన్నీ చేశరండి. మూడవ రోజు కూడా ఉన్నాడండి అల్లుడు వెళ్ళలేదండి.
వారం రోజుల వరకు క్యాంప్ వేసాడండి ఏడు రోజులు అల్లుడు కదలలేదండి. మామగారికి పెద్ద సమస్య ప్రాబ్లం ఏర్పడిందండి. రామరామ నేనేదో రెండు రోజులు ఉంటాడు అనుకుంటే వారం రోజులు క్యాంప్ వేసాడు. ఇంకా కదలలేదే ఆ ఏమి చేయాలి వెళ్ళండి అంటే మర్యాదకు లోటు కదా. ఉండండి అంటే ఇటు బాధ కదండీ, అల్లుడిని పోషించాలంటే కొంచం కష్టం కదండీ అది అందుచేత ఏదో కొత్త కొత్త పలహారాలు ఎక్స్ట్రాలు ఇవన్నీ ఉంటాయండి అల్లుడుగారికి,
అందువల్ల పోషించలేక ఈయన అవస్థ పడుతుంటే ఈయన కదలలేదండి 10 రోజులు ఉన్నాడండి. 10 రోజులు కంటిన్యూస్ గా ఉంటే ఇక ఆయనకి మనసు చాలా విరక్తి పొంది, ఎవరి మామగారికి, మామగారు అత్తగారు అంటే ఏమిటి ఈ అల్లుడుగారి అత్తగారు మామగారు.
ఇద్దరు ఒక అత్యవసర సమావేశం చేసుకున్నారండి ఏమి చేయాలి అల్లుడుగారికి అని చెప్పేసి ఏకాంతంగా ఆ అత్తగారు సూచన చేసింది. బాగా పలహారాలు పెడుతుంటే ఇక్కడ తినబడి తింటూ ఉండిపోతున్నాడు. కాబట్టి మనం పలహారాలు కంప్లీట్ గా ఆపేస్తాం. ఆపేస్తాం ఏమి పిండి వంటలు చేయొద్దు అన్నం చింతకాయ పచ్చడి, ఇంతే ఈ రెండు వేస్తాం అని అత్తగారు సూచన చేస్తే భలే భేష్ చాలా బాగుంది. రేపటి అమలు పరుస్తాం అని మరుసటి రోజు ఒట్టి అన్నం చింతకాయ పచ్చడి పెట్టారండి అల్లుడు గారికి.
అల్లుడు మనసులో అనుకున్నాడు వీడు ఒట్టి పచ్చడి కాదు అన్నం పెట్టినా నేను ఇక్కడి నుంచి కథల, ఒట్టి అన్నం పెట్టిన అని అనుకున్నాడండి.
మళ్లా 12 రోజులు అయిందండి, 12 రోజులు అయితే ఇక మామగారి కోపం జాస్తి అయిపోయిందండి. ఈయన వెళ్ళలేదని పిలిచేసాడండి, అల్లుడుగారు ప్లీజ్ కమాన్ కూర్చోండి.
ఆ మీరు ఇల్లు వదిలిపెట్టి 12 రోజులు అయిందే మీ ఇంటివారు బెంగ పెట్టుకోలా మీ మీద అన్నాడండి . మా అల్లుడు అన్నాడు తప్పకుండా బెంగ పెట్టుకుంటారు కాబట్టే ఈరోజే వారినే రమ్మని చెప్పి జాబు రాస్తాను. రామ రామ అది కూడా చెడిపోయిందండి. ఆ ఉపాయం కూడా చెడిపోయింది ఇక ఏం చేయాలి?
ఒక పెద్ద సమస్యగా ఏర్పడి ఆఖరికండి తెల్లవారు జావన పొద్దున్నేనండిఏడు గంటలకి నిద్ర లేచి అల్లుడుగారు స్నానం చేస్తారండి. బావి దగ్గర స్నానం చేస్తాడు అక్కడ ఒక పెద్ద గోడ ఉందండి తెల్లగా సున్నం కొట్టారు. మామగారికి ఒక ఆలోచన వచ్చింది ఈ గోడ మీద ఏదైనా ఒక వాక్యం రాస్తాం.
అది స్నానం చేసేటప్పుడు చదివి సిగ్గుపడి వెళ్తాడు, అని ఒక బొగ్గు తీసుకుని ఇంకా వాడు స్నానానికి రాలేదండి అల్లుడుగారు. మామగారు రాసాడు పెద్ద తాటికాయ అక్షరాలతో గోడ మీద ఇంటికి వచ్చిన అతిథి మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాసి పెట్టాడు.
ఇంటికి వచ్చిన అతిథి ఆ మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాసి పెట్టాడండి ఆ మామగారు. మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండకూడదు అని రాస్తే పొద్దున్నే ఈయన స్నానానికి వచ్చాడండి, స్నానానికి వచ్చి చదువుకున్నాడు. రామ రామ మావగారు మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండదు అన్నాడు. బొగ్గు తీసుకున్నాడండి దాని కింద రాశాడు మామగారు నేను కూడా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండను సంకురాత్రి, శివరాత్రి, నవరాత్రి రాసీ పెట్టాడండి.
ఆయన మామగారు చదువుకున్నాడు, నారాయణ నారాయణ సంకురాత్రి జనవరి, జనవరిలో వస్తుంది. అది ఆ శివరాత్రి మార్చిలో వస్తుంది. నవరాత్రి అక్టోబర్ నారాయణ తొమ్మిది నెలల క్యాంపు అండి. తొమ్మిది నెలల క్యాంపు.
ఆ అటువంటి అల్లుడు ఒకడు చేరాడండి. మనకి ఎవరో తెలుసునా జన్మార్జితమైనటువంటి దుర్గుణాలండి అవి ఎంత పొమ్మన్నా పోవటం లేదు శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఒక ఉపాయం చెప్పాడు.
ఏమిటో తెలుసునా ఇప్పుడు మురికి నీరు గనుక పోకపోతే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు మంచి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని కొట్టేస్తారండి. మంచి నీళ్ళు తీసుకెళ్లి దాన్ని కొట్టివేస్తే అది పోతాయండి మురికి నీరు లేకపోతే ఒక రాగాన పోవండి అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సద్గుణములను చక్కగా చెప్పి నాయన ఈ సద్గుణముల చేత దుర్గుణములను సాగనంపండి అని 26 సద్గుణములు చెప్తున్నాడండి.
శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా ఉందో చూడండి
అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణయేవచ
నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుగక్షమే
ఎంత చక్కని మనం అన్ని విచారం చేయవలసిన పని లేదండి. ఈ మొదట్లో ఉన్నటువంటి నాలుగు ఉన్నాయి, ఆహ చాలా అద్భుతమైనటువంటి గుణాలండి ఏమటో తెలుసునా
హృదయ వైశాల్యం కలిగిన వారికి మాత్రమే ఇటువంటి గుణాలు ఉంటాయండి
అద్వేష్ట సర్వభూతానాం మైత్రం కరుణయేవచ ఏవండీ ఎవరికి ఉంటాయి చెప్పండి.
ఇది సర్వభూతానాం ఏ ప్రాణి మీద ద్వేషం ఇవన్నీ క్రోధం ఉండకూడదండి ఎప్పుడు ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఎప్పుడో చూసినా ఇదంతా యూనిటీ ఒకే విశ్వరూపం ఒకే భగవంతుని యొక్కస్వరూపం.
దాన్ని గనక మనం హింసిస్తే మనని మనం హింసించుకున్నట్టు అవుతుంది. అనేటువంటి విచారణ. చూడండి దీని పేరు ఆత్మోపమ్యం అక్కడ గనక ఎవరినైనా బాధ చేస్తే నాకు బాధ చేసినట్టు అవుతుంది. అనేటువంటి ఆ అనుభవం ఉంటే తప్ప వీడు లేకపోతే సుగుణ శాంతి వాడికి ఉండదన్నది ఏవండీ అందరికీ అర్థమైందా అద్వేష్ట సర్వభూతానామైత కరుణయేవచ
0 Comments