లక్ష్మీదేవి తామర పువ్వులోనూ,
సరస్సులో తామర నిలకడగా ఉండదు.
నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది.
తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి
తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.
ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని
అర్థం చేసుకోమని పరమార్థం.
తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి....
అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది..
ఈ పూలబావి.
స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే వేస్తారు.
ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు.
స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు.
తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో
శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది.
అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని
పురాణాల గాధ.
ఉత్తర దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు....
మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది.
మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగివున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి.
దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది.
మెదడులో లోపాలు తల ఎత్తుతాయి.
అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే
మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.
స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని
ఎందుకు పెళ్లి చేసుకోవాలి......?
తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం.
స్త్రీకి సిగ్గు ఎక్కువ.
కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి.
స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు.
కష్టపడలేదు.
పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది.
మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా
ఈ ఆచారం.
అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.
పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా ? కాదా ?
పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు
తెలిసి చేసేపని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను
నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి
స్వామిని అలంకరిస్తారు.
అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని
ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది.
వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.
విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగాంతమేనా .....?
శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు.
ధూమశకటాలు నడుస్తాయని,
ముఖానికి రంగేసుకున్న వారు దేశనాయకులవుతారనీ, భర్తలేని స్త్రీ రాజ్యమేలుతుందనీ,
త్రాగే మంచినీళ్ళు కొనుక్కుంటారనీ…
ఆయన చెప్పిన వన్నీ జరిగాయి.
విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకుంటే కలియుగం అంతమయిపోయినట్టే.
అంత ఎత్తున కృష్ణమ్మ ఎగిస్తే ఇక భూమి మీద
ఏం మిగులుతుంది?
కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి....
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి,
ఆనపకాయ, మునగకాయ, వంకాయ,
గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు,
చద్ది అన్నము. మినుములు, పెసలు,
శెనగలు, ఉలవలు; కందులు
ఇవన్నీ వాడరాదు.
అష్టమి నాదు కొబ్బరీ,
ఆదివారము ఉసిరీ తినరాదు.
మంగళ, శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకివ్వరు...
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు
ఖర్చు చేస్తారు.
కనీసం ఆ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము.
అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు.
ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరులకు గానీ ఆపదసమయాల్లో ఈ నిమయం పనికి రాదు.
0 Comments