మన మనసులో మాట ఆపరేషన్ సిందూర్ | రష్యా పాకిస్తాన్కు సహాయం చేయదు – కారణం ఏమిటి?
వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఫైనల్ గా పాకిస్తాన్ వాడు పుతిన్ గారి కాళ్ళు పట్టుకొని శరణు కోరి వెళ్ళాడు. అంటే ఏదో ఒక విధంగా మీ ఇన్ఫ్లయెన్స్ ని వాడండి భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు. అందులో నుంచి మమ్మల్ని కాపాడండి, ఇది పాకిస్తాన్ వాడు మీకు రష్యాను ఉద్దేశించి చేసిన రిక్వెస్ట్.
సయ్యద్ తారిక్ ఫతామి అని చెప్పి ఒక వ్యక్తి ఇతను ఎవరు అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఉన్నాడు చూసారా, అతని పర్సనల్ అసిస్టెంట్. ఇతను ఒక డిస్కషన్ కి వచ్చాడు, ఒక సెమినార్ ఈ సెమినార్ పేరు వాల్డై ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్ అంటారు.
సో వచ్చిన అతను ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించి మాట్లాడాడు. ఇతను ఏం చెప్తున్నాడు అంటే మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సర్గే లేవరో ఈయనను నేను కలిశాను, మా ప్రధానమంత్రి గారు ఒక ఉత్తరము ఇచ్చారు. ఇది వ్లాదిమిర్ పుతిన్ గారికి ఇవ్వమన్నారు అని చెప్పి చెప్పాడు. మరి ఈ ఉత్తరంలో ఏముందండి?
భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంటే మీరు వరుస పెట్టి ఆర్మీ డ్రిల్స్ అంటున్నారు, ఎయిర్ డ్రిల్స్ అంటున్నారు, నేవల్ డ్రిల్స్, పాకిస్తాన్ చుట్టూర్త ఒక మిలిటరీ యాక్షన్. భారత్ వైపు నుంచి కంటిన్యూస్ గా ఈ బ్లాగ్ పోస్ట్ రాసే సమయం కూడా,ఇప్పుడూ కూడాఈ టైంలో కూడా రాజస్థాన్ లో ఒక అతి పెద్ద ఎయిర్ డ్రిల్ అనేది మనం నిర్వహిస్తున్నాం.
ఏమైనా తేడా జరిగితే పాకిస్తాన్ గతి అదోగతి. ఇది మనం క్లియర్ గా చెప్తున్నాం. ఇలా కాదు ఒక డిస్కషన్ టేబుల్ కి రమ్మనండి, మీరు మీడియేషన్ చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాము. ఈ టెన్షన్స్ ను తగ్గించే ఒక ఉపాయము అనేది ఆలోచిద్దాము. ఇది పాకిస్తాన్ వాడి వైపు నుంచి ఒక ప్రపోజల్. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? చూడండి ఫస్ట్ అమెరికా వాడి దగ్గరికి వెళ్ళాడు.
ఇక్కడే చాలా పెద్ద కామెడీ అండి డొనాల్డ్ ట్రంప్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారికి ఫోన్ చేసి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము జరిగింది చూశరా? దీనిని నేనే ఆపేను అని చెప్పి మీరు దయచేసి మీడియాకు చెప్పండి. ఇద్దరు క్లోస్ ఫ్రెండ్స్ కదా కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ట్రంప్ గారే ఆపారు. ట్రంప్ గారే సీస్ ఫైర్ చేయించారు. ఒక మాట చెప్పవా నా ఇమేజ్ పెరిగిపోతుంది కదా అంటే.
పుతిన్ గారు కూడా చాలా చాలా తెలివైన వాడండి. ఆయన ప్రెస్ మీట్లో టాస్ అనబడే ప్రముఖ పత్రిక. వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రెస్ మీట్ లో బిగినింగ్ నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన యొక్క ప్రెజెన్స్ వల్ల ఆయన మాట్లాడడం వల్లే మీకు ఈ సీస్ ఫైర్, ఆపరేషన్ సింధూర్ యొక్క సీస్ ఫైర్ అనేది జరిగింది అని నవ్వుతూ ఆయన చెప్తున్నాడు.
ఇక్కడ సూక్ష్మం ఏమిటి?
రావెల్పెండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో అమెరికా వాడి ఆయుధాలు న్యూక్లియర్ అస్త్రాలు అక్కడ వాడు దాచిపెట్టాడు. ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ రావల్ పెండి అనబడే నగరం చెప్తున్నాం చూసారా 33 లక్షల 50 వేల మంది ప్రజలు అక్కడ నివసిస్తారండి. ఒకవేళ ఈ అనుస్త్రం యొక్క రేడియేషన్ మీకు లీక్ అయ్యి ఆ నగరమంతా వ్యాప్తి చెంది ఉంటే ఆ గాలులు భారత్ దాకా వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటి?
మరి ఇది ఇండియా మీదే కదా మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం మాట్లాడుతుంది? భారత్ బ్రహ్మోస్ వాడడం వల్లే ఇలాగ ఈ అను అస్త్రాలు పేలాయి? కాబట్టే ఈ న్యూక్లియర్ రేడియేషన్ చెప్తారు కదా.
కానీ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాకు అక్కడ ఒక న్యూక్లియర్ సైట్ ఉన్నట్టే తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది మీకు పాకిస్తాన్ అమెరికా వాడు కలిసి ఆడిన ఈ నాటకం. అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళకి ఏమి చెప్పలేదు. మనకు ఇవ్వాలండి నీ దగ్గర ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ డిపోలో నువ్వు దీన్ని ఉంచావు చెప్పాలి.
మరి ఇది లీక్ అయిపోతుంది కదండీ. ఇన్ఫర్మేషన్ మనకు అనిపిస్తుంది అలా కాదు హైదరాబాద్లో మేము ఇన్ని అణువస్త్రాలను ఉంచాము. హైదరాబాద్ అంటే ఒక పెద్ద నగరం కదా ఇక్కడ ఎక్కడ ఏ గోడౌన్లో ఏ డిపోలో మీరు ఉంచారు. ఎవరికీ తెలియదు కానీ ఫలానా లొకేషన్ లో మీ వద్ద ఒక న్యూక్లియర్ సైట్ ఉందని మీరు చెప్పాలి. ప్రపంచానికి చెప్పాలి, అమెరికా వాడు చేయలేదు, పాకిస్తాన్ వాడు చేయలేదు. కాబట్టి రేపు పేలింది అనుకోండి అండర్ గ్రౌండ్ నుంచి ఒక పెద్ద న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగితే ఎవరు మనల్ని అడగలేరు ఎందుకంటే దొంగకు తేలు కుట్టినట్టు.
వాడు ఏమి మాట్లాడలేడు, ఎందుకంటే ఎవరికీ చెప్పలేదు? అలాంటి సిట్యువేషన్ ఉన్నప్పుడు, అమెరికా వాడు బిగినింగ్ నుంచే ఇందులో అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా కీన్ గా అబ్సర్వ్ చేస్తున్నాడు. దీనినే వ్లాదిమర్ పుతిన్ గారు నవ్వుతూ అవునురా ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ గారి పుణ్యమే. ఆయనే యుద్ధాన్ని ఆపేరు ఈ సీస్ఫైర్ యొక్క ప్రథమ కారకుడు సూత్రదారి ఆయనే నవ్వుతూ చెప్పాడు.
డొనాల్డ్ ట్రంప్ గారికి ఆనందంగా ఉండొచ్చు కానీ అసలు విషయాలు మనం ఆల్రెడీ ఎక్స్పోజ చేసి ఉన్నాం. ఇప్పుడు యుద్ధం అవసరమా? ఆపరేషన్ సింధూర్ని ఆపేయవచ్చు? ఈ మిలిటరీ డ్రిల్స్, ఎయిర్ డ్రిల్స్, నేవల్ డ్రిల్స్ ఏమి అక్కర్లేదు.
వాడు వాడి పుణ్యాన అక్కడ ఉంటాడు. మనము మన పనులు చేసుకోవచ్చు కదా, ఎవరికైనా అనిపిస్తుంది.
ప్రపంచ స్థాయిలో అందరూ ఇదే కదా మాట్లాడుతున్నారు. యూఎన్ లో ఇదే అంటున్నారు. అమెరికా వాళ్ళ మీకు ఉపాధ్యక్షుడు జెడి వన్స్ అందరూ ఇదే మాట్లాడుతున్నారు కదా .
కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమిటి అంటే ప్రస్తుతము ఈ ఉత్తరము రాసింది ఎవరండి మీకు షాబాష్ షరీఫ్ అంటే మీకు సివిలియన్ గవర్నమెంట్ యొక్క ప్రధానమంత్రి. ఇంకొక వర్గము ఏమిటి పాకిస్తాన్ ఆర్మీ వాడు వాడికి తోచింది చేస్తాడు.
ఇంకొక వర్గము ఏమిటి పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ ఉంటారు.
ఈ పరిస్థితిలో భారత్ ఏం చెప్తుంది కచ్చితంగా మేము ఈ పాకిస్తాన్ తో నెగోషియేషన్స్ అనేవి చేయము. మాకు ప్రమాదము అనిపించిందా మేము పాకిస్తాన్ మీద దాడులు చేస్తాము.
ఇదే మా స్టేటస్ కో క్లియర్ గా మనం చెప్తున్నాం. ఇలా ఎందుకు చెప్తున్నాము అంటే?
మీకు ఒక గ్రేట్ ఎగజాంపుల్ చెప్తాను అటల్ బిహారీ వాజ్పాయి గారు మీకు 1999 లో బస్సు డిప్లమసీ అనేది చేశారు. అంటే నేను ఒక బస్సులో లాహూర్ దాకా వెళ్తాను సో మూడు యుద్ధాలు చేశాము ఎంత నష్టము ఇకమీదట యుద్ధాలు జరగనివ్వను భారత్కి పాకిస్తాన్ మధ్య స్నేహమే ఉంటుంది. యుద్ధము ఉండదు అని చెప్పి ఈయన ఒక బస్సు వేసుకొని లాహూర్ దాకా వెళ్ళారు. ప్రముఖ నటులు, మీకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఆయన వెనక కూర్చున్నారు. వెళ్ళిన ఆయన చాలా ఆనందం, అబ్బా బార్డర్స్ అనేవి తొలగిపోయాయి. ఒక బస్సు ప్రయాణము చాలా గొప్పగా చెప్పుకున్నారు. విత ఇన్ మంత్స్ ఏమైందండి? మీకు ఈ పర్వేష్ ముషరఫ్ అనేవాడు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి మిలిటరీ తిరుగుబాటు ఇతను నేనే నియంత నేనే డిక్టేటర్ ని పాకిస్తాన్ యొక్క పాలకుడు అన్నాడు. అనిన వాడు చూడండి ఫ్రెండ్స్ ఈ బస్సు డిప్లమేసీ అయిన వితిన్ మంత్స్ వాళ్ళు మన మీద కార్గిల్ యుద్ధము అనేది చేశారు.
సో మనకి ఎంత నష్టము? వాడికి చాలా పెద్ద లెవెల్లో నష్టం, మనం కూడా చాలా నష్టపోయాం. కానీ 2001 లో ఇదే ముషరఫ్ అనేవాడు భారత్కి వస్తున్నాడు. ఆగ్రా సబ్మిట్ చూడండి ఎలా ఉందో వీడే యుద్ధము చేయించినవాడు. వాడికి మనము రెడ్ కార్పెట్ వేసి మళ్ళీ వెల్కమ్ చేశం. అంటే మనము ఎంత సాఫ్ట్ గా ఉంటాము వాడు కరుడు కట్టిన తీవ్రవాదులు అని తెలిసినా కూడా మనం ఆ రా మళ్ళీ మనం స్నేహపూర్వం ఇదే మాట్లాడుతూ ఉంటాం.
కానీ ఇవాళ చేంజ్ ఏంటండి ఒకవేళ ఈ తీవ్రవాదులు కాశ్మీర్లో దాడులు చేస్తే భారత్ పాకిస్తాన్ పై అటాక్ చేస్తుంది. ఎందుకు మోదీ గారు క్లియర్ గా చెప్తున్నారు. తీవ్రవాదులు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళ బిల్డింగలను కూడా మేము ధ్వంసం చేశం.
అంటే సపోర్ట్ పాకిస్తాన్ ఆర్మీ వైపు వీళ్ళకి మెయిన్ స్పాన్సరర్ ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్ కాబట్టి ఇకమీదట మాకు ఈ ముగ్గురు కూడా సమానమే. మేము విడిగా చూడము. దీనిని పాకిస్తాన్ టెర్రరిజం అని అంటాము. కాబట్టి తీవ్రవాదులను మీరు మాట్లాడతారు మేము మాత్రం పాకిస్తాన్ మీద మీదే యుద్ధము చేస్తాము మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అని ఒక అతి పెద్ద పాలసీ డిసిషన్ ఇవ్వాళ మనం తీసుకున్నాం.
ఇక్కడే తేడా వాడు ప్రపంచంలో ఎవడితో మాట్లాడిన నువ్వు దిక్కున్న చోట చెప్పుకో. మేము ఏం చేయాలో అదే చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపలేరు.
ఇప్పుడు పుతిన్ గారు ఏమంటున్నారు దయచేసి మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. మరి ఇప్పుడు రష్యా పాకిస్తాన్ తరఫు నుంచి భారత్ తో మాట్లాడుతుందా అనుకుంటే నథింగ్ డూయింగ్ అని క్లియర్ గా వాళ్ళు చెప్పేశరు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు ఆలోచించి కామెంట్స్ లో రాయండి .
0 Comments