మా తెలుగు తల్లికి మల్లె పూదండా
"మా తెలుగు తల్లికి మల్లె పూదండా" మనలో చాలమందికి పాటను ఎవరు పాడారు ఆవిడ ఎలావుంటుదో తెలియదు. ఈ పాటని పాడినది టంగుటూరి సూర్యకుమారి గారు. తను టంగుటూరి ప్రకాశం గారి తమ్ముడి కూతురు.
మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శంకరంబాడి సుందరాచారి.
సుందరాచారి 'మా తెనుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించారు.కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడాలన్న కోరికకు ఈ పాట సరిపోలేదు కాబట్టి ఆ సినిమాలో చేర్చలేదు.
టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
ఈ పాటపై హక్కులను సూర్యకుమారి సుందరాచారికి 116 రూపాయలిచ్చి కొనుక్కున్నది.ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధదర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు. లీడర్ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారి పాటను కొత్త పాటతో కలిపి కథానాయకుడిపై చిత్రీకరణ చేశారు.
0 Comments