భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుతుంది!

భోజనం తర్వాత నడకతో షుగర్ తగ్గుతుంది!

మెల్బోర్న్: రోజూ భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే.. రక్తంలో షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయట! ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత స్వల్ప నడకతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చట! అంతేకాదు.. రోజూ అరగంట నడక కన్నా భోజనం తర్వాత స్వల్ప నడక వల్లే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గుతాయని న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్ర వేత్తలు వెల్లడించారు.

పరిశోధనలో భాగంగా.. 41 మంది టైప్ 2 మధుమేహ రోగులను ఒక వారం పాటు రోజూ వారికి ఇష్టమైన సమయంలో 30 నిమిషాల పాటు నడవమని చెప్పారు. కొంత కాలం తర్వాత.. మరో వారం రోజులపాటు భోజనం చేశాక 10 నిమిషాలు నడిపించారు.

దీంతో రోజూ అరగంట నడిచినవారి కన్నా.. భోజనం తర్వాత పది నమి షాలు నడిచినవారిలో సగటున బ్లడ్ షుగర్ లెవెల్స్ 12 శాతం వరకూ తగ్గిపోయాయని గుర్తించారు. రాత్రి భోజనం తర్వాత నడిచినవారిలో ఏకంగా 22 శాతం వరకూ బ్లడ్ షుగర్ తగ్గినట్లు తేలింది.

Post a Comment

0 Comments