చిన్న విషయానికే మాటామాటా పెరిగి భార్యతో గొడవపడి...........

హోటల్ కు వచ్చి భోజనం చేస్తున్నాడు రఘు.
తింటూ తన పక్కనున్న టేబుల్ వద్ద కూర్చొన్న ఓ డెబ్బై ఏళ్ళ పెద్దాయనను చూసాడు. ఆయన తన ప్లేట్లోని ఆహారాన్ని సగం తిని , మిగతా సగాన్ని పక్కనున్న ప్లేట్లో ఉంచుతున్నాడు.
అలా పక్క పేట్లో ఆహారాన్ని ఉంచేటప్పుడు , తన చేతిలో ఉన్న ఓ ఫోటో వైపు చూస్తూ పదే పదే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
అది చూసిన రఘుకు ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి ఆ పెద్దాయన పక్కనున్న తాను ఉంచిన ఆహారాన్నంతటినీ ఒక కవర్లో వేసుకొని కుర్చీ లోంచి లేవబోయాడు.
వెంటనే రఘు ఆ పెద్దాయన దగ్గరికెళ్ళి , “ సార్, నేను చాలాసేపటి నుండి చూస్తున్నాను , మీరెందుకలా.......? సగం తిని , మిగతాది పక్క ప్లేట్లో ఉంచి , ఇప్పుడు కవర్లో వేసుకున్నారు. ఆ ఫోటో ఎవరిది? అని అడిగాడు.
అప్పుడు ఆ పెద్దాయన , “ ఈ ఫోటో నా భార్యది, నలభై ఏళ్ల పాటు నాతో కష్టసుఖాలను పంచుకొని , రెండేళ్ళ క్రితం క్యాన్సర్ తో చనిపోయింది.
ఆమె ప్రతి పుట్టినరోజుకూ హోటల్ కు వెళ్ళి భోజనం చేసేవాళ్ళం. ఈరోజు ఆమె పుట్టినరోజు. నేను బ్రతికినంతకాలం ఆమె జ్ఞాపకాలు నా గుండెల్లో అలాగే నిలిచి ఉండాలని, ఈ ఫోటోను పట్టుకొని, సగం తిని, మిగతాది కవర్లో వేసుకున్నాను.
ఈ కవర్ ను తీసుకెళ్ళి నా భార్య సమాధి దగ్గర పెడతాను. ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా ఆమె పంచిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ నాలోనే సజీవంగా ఉంటాయి “ అంటూ ఆ పెద్దాయన కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఆ పెద్దాయన మాటలు వినగానే, రఘుకు వెంటనే చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది.
భార్యాభర్తల బంధం విలువేంటో తెలిసొచ్చింది.
చిన్న విషయానికే భార్యతో గొడవపడి............
ఇలా హోటల్లోకి ఒంటరిగా వచ్చి తినడం తప్పుగా అనిపించింది.
వెంటనే ఇంటికెళ్ళి భార్యకు సారీ చెప్పి, హోటల్ లో ఆ పెద్దాయనతో జరిగిన సంభాషణ విషయం చెప్పడంతో ఇద్దరూ చెమర్చిన కళ్ళను తుడుచుకున్నారు.
All reactions:
22

Post a Comment

0 Comments