నేను ఒక ప్రసిద్ధి చెందిన మహిళను అడిగాను..
తన విజయానికి రహస్యం ఏమిటని...
ఏ రోజు నుంచి అయితే నేను అవసరం లేకుండా చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం ఆపేసానో,
ఆ రోజునుంచే నా విజయం మొదలయ్యింది ...
నా గురించి పుకార్లు చెప్పేవారితో పోట్లాడటం మానేసాను..
నా అత్తమామలతో పోట్లాడటం మానేసాను..
నా మీద కొందరి ధ్యాస రావడం కోసం,
కావాలని చేసే పోట్లాటను , నేను పోట్లాడటం మానేసాను..
ఎవరైనా, నేను ఒకలాగా మాత్రమే ఉండాలి అనుకుంటే , వారి అంచనాలను అందుకోటానికి
నేను పోరాడటం మానేసాను...
సంబంధంలేని, భరించలేని మనుష్యులుతో
నా హక్కుల కోసం పోరాడటం మానేసాను..
అందరినీ సంతోషపెట్టడం కోసం
పోరాడటం మానేసాను..
నా గురించి మీరు తప్పుగా అనుకున్నారూ అని నిరూపించుకోవడానికి పోరాడటం మానేసాను..
ఇలాంటి అర్థం లేని పోట్లాటలు అన్నీ, పోట్లాడటం తప్ప వేరే పనిలేని వారికి వదిలేసాను..
నా ఆశయం కోసం...
నా కలల కోసం..
నా అద్రృష్టం కోసం...
నా నమ్మకాల కోసం ...
మాత్రమే నేను పోరాడటం మొదలుపెట్టాను...
అంతే, అలా ఏ రోజైతే నేను అర్థం లేని పోట్లాటలు మానేసి...అసలైన, అవసరమైన విషయాల కోసం పోరాడటం మొదలుపెట్టానో..ఆ రోజు నుంచే నా అడుగులు విజయపధాన్ని పట్టాయి..నాకు అసలైన విలువని, గుర్తింపుని కూడా నేను తెచ్చుకోగలిగాను....అని ఆవిడ చెప్పారు....
నిజమే కొన్ని పోట్లాటలకు సమయం వెచ్చించడం, సమయం వ్రృధా చేయడం చాలా పొరపాటు...
ఏ విషయం కోసం పోరాడాలో నిర్ణయించుకోవడంలోనే నీ సమయాన్ని ఆదా చేసుకుంటూ, నీ విజయాన్ని నువ్వు అందుకోగలుగుతావు...
..... ....సేకరణ
0 Comments