ఆదిగురువు శంకరాచార్యుల వారు రచించిన “అచ్యుతాష్టకం”

ఆదిగురువు శంకరాచార్యుల వారు రచించిన “అచ్యుతాష్టకం”

అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ । శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచన్ద్రం భజే ॥

అచ్యుతుడు,కేశవుడు, రామ నారాయణుడు, కృష్ణ దామోదరుడు, వాసుదేవుడు, హరిః,

శ్రీధరుడు, మాధవుడు, గోపికా వల్లభుడు,జానకీ నాయకుడు అయిన శ్రీరామచంద్రుడిని నేను సదా భజిస్తాను.

అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితమ్ । ఇన్దిరామన్దిరం చేతసా సున్దరం దేవకీనన్దనం నన్దనం సన్దధే ॥

అత్యుచుడు , కేశవుడు, సత్యభామ యొక్క భర్తయైన మాధవుడు, శ్రీధరుడు

రాధా దేవి పూజించు రమనుడు

లక్ష్మీదేవిని హృదయ మందిరం లో నిలుపుకున్న సుందర నారాయణుడు ను

దేవకీ, నందుల సంతానమైన కృష్ణుడిని నా మనసులో ఆరాధిస్తున్నాను.

విష్ణవే జిష్ణవే శఙ్ఖినే చక్రిణే రుక్మిణిఱాగిణే జానకీజానయే । వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః ॥

శంఖ, చక్రధారియైన విష్ణువుకు, జయవంతుడైన జిష్ణువుకు,

రుక్మిణి రమణుడైన కృష్ణునికి, జానకీ నాయుడైన రామచంద్రునికి,

గోపికల ప్రియుడైన గోపాలకృష్ణునికి, కంసుని సంహరించిన వంశీధరుడైన నారాయణునికి

నమస్కారములు.

కృష్ణ గోవిన్ద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే । అచ్యుతానన్త హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥

హే కృష్ణ, గోవింద, రామ, నారాయణ, శ్రీపతీ, వాసుదేవ, అజిత, శ్రీనిధీ!

హే అచ్యుత, అనంత, మాధవ, అధోక్షజ! ద్వారకానాయకా, ద్రౌపదీ రక్షకా నీకు నమస్కారములు.

రాక్షసక్షోభితః సీతయా శోభితో దణ్డకారణ్యభూపుణ్యతాకారణః । లక్ష్మణేనాన్వితో వానరైః సేవితోఽగస్త్యసమ్పూజితో రాఘవః పాతు మామ్ ॥

రాక్షసులను సంహరించిన వాడు సీతాదేవితో శోభించిన వాడును,

దండకారణ్యాన్ని పవిత్రం చేసినవాడును

లక్ష్మణుడు, వానరులతో కూడి, అగస్త్య మహర్షిచే పూజింప బడినవాడును అయిన రాఘవుడు నన్ను కాపాడు గాక.

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః । పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా ॥

ధేనుకాసురుడు, కేశి, కంసుడు వంటి దుష్టులను సంహరించిన వాడును,

పూతనను సంహరించి, సూరజలతో ఆడిన బాల గోపాలకృష్ణుడు నన్ను

ఎల్లప్పుడు కాపాడును గాక

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడమ్భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ । విద్యుదుద్యోతవాన్ వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాఙ్ఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥

కుఞ్చితైః కున్తలైర్భ్రాజమానాననం రత్నమౌలిం లసత్కుణ్డలం గణ్డయోః । హారకేయూరకం కఙ్కణప్రోజ్జ్వలం కిఙ్కిణీమఞ్జులం శ్యామలం తం భజే

వంపులు తిరిగిన కేశాలతో, తేజో వంతమైన ముఖంతో, మణిమకుటధారిగా,

చెవుల వద్ద మణికుండలాలతో ప్రకాశిస్తూ, హారాలు, కంకణాల తో మెరుస్తూ,

కింకిణీల నాదముతో అలరించు ఆ శ్యామవర్ణ కృష్ణుడిని నేను భజిస్తున్నాను.

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ । వృత్తతః సున్దరం కర్తృ విశ్వమ్భరస్తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ ॥

ఎవడు ఈ అచ్యుతాష్టకాన్ని ప్రతి రోజు భక్తితో చదువుతాడో,

ఆ భక్తునికి కావలసిన మనోరథములు అన్నియు నెరవేరును.

Post a Comment

0 Comments