కల్ప వృక్షాలు - కామధేనువులు

-రామకృష్ణ వారణాసి

ఆంధ్రులు రొండు కల్ప వృక్షాలు ఉన్నాయని ఒప్పుకున్నారు . ఒకటి తాటి చెట్టు . రొండోది కొబ్బరిచెట్టు .
వీటిని కల్ప వృక్షాలు అని ఎందుకన్నారన్న డౌట్ వస్తే - నేను ఏనిమేదో తరగతిలో చదివిన " ఆంధ్రుల కల్ప వృక్షము " అన్న పాఠం మొత్తం - కాపీ - పేస్టు చేయాల్సొస్తది. రెండూ కల్ప వృక్షాలే అయినా - ఎర్రగా బుర్రగా వున్నా - కొబ్బరి చెట్టు కల్ప వృక్షమై ఇళ్లలో వెలిసింది . తాడిచెట్టు ఊరి బయటకు పోయింది .
కొబ్బరి చెట్టుకు ప్రతీక కొబ్బరి కాయ . దాన్ని మొలకెత్తిస్తే - మళ్ళా కాయలు కాస్తుంది . అందుకని - కోడలు మన ఇంటి పాలిటి ( వంశాన్ని విస్తరించే ) కల్పవృక్షం అన్నా భావనతో - పెళ్లి కూతురి చేతుల్లో కొబ్బరి బొండం పెడతారు .
కొత్త కోడలు కల్పవృక్షం లాంటిది అని తెలియిక పోయినా - అత్తలు - ఒకసంవత్సరం దాటకుండానే - కోడలు కాయలు కాయించటం లేదని కంగారు పడతారు . " ఆ దేవుడు దాని కడుపున ఒక కాయ ఎప్పుడు పడేస్తాడో ? ఏమిటో ? అని అతి గంభీరం గా మూలుగుతూ - నసుగుతూ వుంటారు . అట్లా అత్తలు- కోడలు కల్ప వృక్షం అని ఒప్పుకున్నారు. కోడలు కాయలు కాయాక పోతే - హాస్పిటల్కి తిప్పి - ఎరువులు - మందులు వేయిస్తారు . ఆరకంగా గూడ అత్తలు - కోడలు కల్ప వృక్షం అని ఒప్పి నట్లే.
కల్ప వృక్షం ఏమి చేస్తుంది ? ఏది కావాలంటే అది ఇస్తది . " అమ్మాయి - వాడికి కాస్త చెప్పమ్మా .. ఏసీ రిపేర్ చేయించామని " అని అత్తా అడగంగానే - కోడలు అది చేపిస్తాది . కోడలు కల్ప వృక్షమని - అత్తలు ఒప్పుకున్నట్లైంది .
కల్పవృక్షము కోర్కెలు తీర్చేముందు - చాలా ఆలోచన చేస్తా దని - మనసులో ధర్మా - అధర్మాలు తూర్పారా పట్టుద్దని, న్యాయ అన్యాయాలు - నిగ్గు తేల్చుకుంటదని, వేరే చెప్పక్కర్లేదు . నాకు బెంజి కారు కావాలంటే , కల్పవుక్షం టక్కున ఇస్తదా ? అట్టా ఇస్తే పాప పుణ్యాల లెక్కలు చూసే దేవుళ్ళ జాబులు ఏమయ్యేటట్లు ? మిగతా దేవుళ్ళ పనేమి కాను ? . కల్పవృక్షం దేవుళ్ళకన్నా ఎక్కువ న్యాయ - అన్యాయాలు విచారించి - కోరిక తీరుస్తది .
అత్త కుర్చీలో కూచొని - మొగుడితో కబురులు ఆడుతూ - ఒకాఫీ తీసుకు రావే - అని కేక వేయగానే - కోడలు కల్పవృక్షం - కాఫీ తీసుకోరాదు . అత్త జీవితం మొత్తాన్ని తూర్పార పట్టి - , న్యాయ - అన్యాయాలు - నిగ్గు తేల్చుకుంటదని, వేరే చెప్పక్కర్లేదు. . కాఫీ ఇవ్వగూడదు అని నిర్ణయం తీసుకుంటుంది . పాలు లేవు అత్తయ్య .. అని పాలు సింకులోకి ఒంపేసి - ట్యాపుతిప్పుతుంది. కల్పవృక్షం - గతమంతా విచారించి - పై దేవుళ్లను సంప్రదించి - కోరదగ్గ కోరిక కోరినప్పుడే తీరుస్తుంది . ఏది పడితే అది కాదు .
కోడలు కల్పవృక్షం కూడా అంతే . అత్త జీవితాన్ని మొత్తం విచారించి - ఫై దేవుళ్లను సంప్రదించి -కోరదగ్గ కోరిక కోరినప్పుడే తీరుస్తుంది. . కాఫీ కోర్కెలు తీర్చదు .
కల్ప వృక్షం అంటే ఈ కొమ్మకు వేప కాయలు కాయించి , ఆ కొమ్మకు మామిడి కాయలు కాయించేది .
కోడలు కల్పవృక్షం ఒకకొమ్మన అత్తామామలు చేసిన పాపాలను వాళ్ళకే తినిపించే కాయలు కాయించి ,.రొండో కొమ్మన వంశం కోసం దోసపండ్లను కాయించే కల్ప వృక్షం . ఆ కాయలు కాయటం కోసం ఎన్నో మందులు మింగి , పుట్టిన బిడ్డల కోసం నోములు నోచే కల్ప వృక్షం .
కోడలు కొబ్బరి బొండం చేత ధరించి - పెళ్లి పీటలు ఎక్కుతున్నది మీకు కల్ప వృక్షంగా మారటానికి . మీరు ఎందుకనుకున్నారో ఏమో.
కామ ధేనువు అనగానే - అమ్మాయి అనుకునేరు . అది అబ్బాయి . అబ్బాయికి ఎన్నో పెట్టి పోషించుతాము . దుక్క బలిసినాక , తన ఒపికలో మనకింత , తన ఆనందంలో మనకింత , తన కాలంలో మంకింతా . తన లోచనలో మనకింతా - పాలు పంచుతాడని . కామధేను వు కల్పవృక్షము - ఒక జతకాబట్టి - కామధేనువుని కల్ప వృక్షానికి జత కలిపి - కల్ప వృక్షపు నీడలో - కామధేనువును వుంచుతాము . వాటి నీడలో , వాటి అండతో జీవితాన్ని గెలుద్దామని చూస్తాము
కల్ప వృక్షం మన కోరికలను తీర్చటమే కాదు - దాని కోరికలను అది తీర్చుకునే శక్తీ , యుక్తి తెలిసినది కూడా . కల్ప వృక్షం కదలదు గా . అందుకని కామధేనువును కదిలించి , కోర్కెలు తీర్చుకుంటుంది .
ఆ కల్ప వృక్షం నీడన తిరిగీ తిరిగీ - ఆ ఆకులు మెసీ మెసీ - కామధేనువు కూడా - తల్లి తండ్రుల కోర్కెలను , జీవితాలను తూర్పార పట్టటం , న్యాయ అన్యాయాలు నిర్ణయం చేయటం నేర్చుకుంటుంది . మనం అంతకు ముందు నేర్చుకున్నట్లుగా .
చివరికి కామధేనువు మనకు పాలు ( కొంత భాగం ) ఇవ్వటం మాని - మీ పాప ఫలాలను మీరు అనుభవించాల్సిందే - కల్ప వృక్షం కాయించిన కాయలు తినండి - అని రికమండ్ చేస్తుంది
అప్పుడు వేరు కాపురాలు - అవుతాయి . అందులో నిజమైన ఆవును తిప్పుతారు . మరి ఎందుకనుకున్నారో ఏమిటో ?
(నవ్వు – వ్యంగ్యము - సత్యము - అసత్యము , సంతోషము - విచారము - అన్నీ ఒకే చెట్టున కాయించా లని రాసాను . నిజమ్ - అనుకోవద్దు . అనుకున్నా మంచిదే )

Post a Comment

0 Comments