ఆడవాళ్ళ నోటిలో..నువ్వు గింజంత

మాట కూడా దాగదు..
అని పాత సామెత నిజం అది కాదు..
మహిళల మనసు లోతుల్లో అన్ని పదిలం..
చిన్నప్పుడు అమ్మ మాటే వేదం..
పెళ్లి అయితే భర్త మాటే వేదం..
బాధ వస్తే కన్నీళ్లు పర్యంతం..
నిజాలు చెప్పలేక మింగలేని దౌర్భాగ్యం..
భర్త కళ్లెదురుగా తప్పులు చేసినా
తన తోటి యుద్ధం..బయటికి చెప్పలేని
అసమర్థత..
పరువు పోతుందనే భయం..
నలుగురిలో చులకన అవుతాననే సందేహం..
భర్త మర్యాద కాపాడాలనే తపన..
సర్దుకుపోవాలి అనే ఆలోచన..
భూదేవిలా ఓర్పు క్షమించగల మనస్తత్వం..
గుండెలోతుల్లో భరించలేని నరకం..
చిరునవ్వుల పెదవులపై చూపించి..
కాలకూటం దిగమింగి నిజాలు చెప్పలేని
సగటు స్త్రీ..
ఎన్ని తప్పులు చేసినా మళ్లీ చెయ్యొద్దని చెప్పి
అక్కున చేర్చుకుని ఓదార్చడం భార్య గొప్ప
మనసుకే సాధ్యం..
తొందరపడి నిజం చెప్తే కాపురాలు కూలిపోతాయి
అనే ఆలోచన..పోనీలే అని‌, పరువు
మర్యాద కోసం..పిడికెడంత గుండెలో
అంతులేని బాధ సమాధి చేస్తుంది స్త్రీ..
🙏🌹🌺💐🌹🌷💛💙🧡💜
May be an image of 1 person and smiling


Post a Comment

0 Comments