The God who is standing tall! | కొలువై వున్నాడే దేవ దేవుడు!

 కొలువై వున్నాడే దేవ దేవుడు! 

ఆహా! ఈ పాట విన్నప్పుడల్లా నేను పరవశించిపోతాను. సంగీతం, నాట్యం రెండింటికీ ప్రధాన నిలయమైన ఈ గీతం నాకు అపారమైన ఆనందాన్నిస్తుంది. అయితే, ఇంతకు ముందు ఎప్పుడూ దీని సాహిత్య అర్థాన్ని గమనించలేదు. కొన్నిసార్లు ప్రయత్నించినా పూర్తిగా అర్థం కాలేదు - సగం అర్థమై, సగం అర్థంకాక నిరాశ చెందుతుందిని.

అయితే నా ఆరాధ్య దైవమైన శ్రీహరిని ఎంత అందంగా స్తుతిస్తున్నారని అనిపిస్తూ వుండేది.  ఆ పాటలో ఉన్న  దేవదేవుడు,వనిత మొహనాంగుడు,పాలుగారు మోము,నలవేలు వంటి విశేషణములను చూసి.కాని అదే సమయంలో మరి కొన్ని విశేషణములైన వలరాజు పగవాడూ,కులవంక నెలవంక,పులి తోలు గట్టి వంటి వాటిని పరిశీలిస్తే పరమశివుని స్తుతిస్తున్నట్లుగా కనిపించింది. ఏది ఏమైనా ఇందులో హరిహర అద్వైతం దాగి వుందని భావించి.  ఈ పాటను సాహితీ పరంగా పూర్తిగా  అర్ధంచేసుకోవలన్న సంకల్పంతో నాకు స్ఫురించిన భావాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.

అయితే ఈ పాట గురించి మరింత వివరణ ఇచ్చేముందు మరి  కొన్ని విషయాలను ఇక్కడ చెప్పదలుచుకున్నాను.ఈ పాటకు అర్ధంతో పాటు కవి హృదయాన్ని కూడా తెలుసుకోవాలనుకున్నాను.

ఈ పాటలో ప్రతి పదంలో ప్రతి వాక్యంలో నాకు శివకేశవుల అద్వైతం కనపడింది.కాని చివర రెండు పంక్తుల దగ్గరకు వచ్చేసరికి కవిగారు సదాశివుని స్తుతిస్తూ రాశారని అర్ధమైనది..కాని నాకు ఈ పాటలో మొదట్నుంచీ హరిహరుల తత్వం కనపడింది మరి ఈ పంక్తులలో కనపడలేదేమిటా అని అనుకున్న సమయంలో ఆ శ్రీమహవిష్ణువే నాకు సమాధానాన్ని ఇచ్చాడు అనిపించింది.

అయితే నేను చెప్పదలుచుకున్న మరో విషయం ఏమిటంతే ఈ పాటలో వున్న కొన్ని పదాలకి అర్ధాలు నాకు అవగతం కాలేదు…అందుకే వాటీని విడగొట్టి అర్ధాన్ని వెతుకవలసి వచ్చింది.ఈ ప్రయత్నము ఆ దైవ కృప వలన సఫలమైందని అనుకుంటున్నాను.. ఈ పాటకు అర్ధాన్ని తెలుసుకోవాలి అన్న నా తపన,అందుకోసం పడ్డ కష్టం,అలాగే తాత్పర్యం రాయడానికి స్నేహితులు అందించిన సహాయసహకారాలు నాకెంతో సంతోషాన్ని,ఆత్మ సంతృప్తిని కలిగించాయి.

ఏదైనా తప్పులు కనిపిస్తే, సహృదయంతో సరిదిద్దగలరు.

కంఠేన్(అ)ఆలంబయేత్ గీతం
హస్తేన అర్థం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం
పాదాభ్యాం తాళం ఆచరేత్

గీతం అన్నది కంఠమే ఆలంబనగా ఉంటుంది,హస్తాలు అర్థాన్ని ప్రదర్శిస్తాయి,కళ్ళు భావాన్ని చూపుతాయి,పాదాలు తాళానికి అణుగుణంగా ఆడతాయి అన్న ఈ శ్లోకం మనకు అంటే సామాన్య మానవునకు నాట్య శాస్త్రం లోని సారంశాన్ని  అతనికి అర్ధమయ్యే రీతిలో చెపుతుంది.శాస్త్రీయ నృత్యం గురించొ చెప్పే ఈ శ్లోకాన్ని తనదైన శైలిలో మనందరికి  పరిచయం చేసిన ఘనత మన కాశినాధుని విశ్వనాథ్ గారికే దక్కుతుంది.


కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరు చులవంక కనరా
పలుపొంకమగు చిలువలకంకనములమర
నలువంకల మణిరు చులవంక కనరా

తలవంక నలవేలు
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

మేలుగరతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
మేలుగరంతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కెయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీను పొడమా
పాలు గారు మోమున శ్రీను పొడమా
పులి తోలు గట్టి ముమ్మోన వాలు బట్టి తెరగా

శివ తత్వము:

విశ్వనాధుడైన మహాదేవుడు దేవ దేవుడై కోటి  సుర్యుల తేజస్సుకు సమానముగా ప్రకాశిస్తూ కోలువై వున్నాడు ..వలపులకు రాజు అయిన మన్మధునికి పగవాడై … వనిత అనే మోహనమైన అంగము కలిగినవాడు(పర్వతి దేవిని తన అంగముగా చేసుకుని అర్ధనారీశ్వరుడైనాడు.)

వివిధ రకాలైన సర్పములను నీ ఆభరణాలుగా జేసుకున్న పరమశివా …. నాలుగు దిక్కులా తమ మణులకాంతిని ప్రసరిస్తూ వెలుగును నింపుతున్న నాగరాజములను కరుణతో జూడవయ్యా!లేక ఇలా కూడా అర్ధం చేసుకోవచ్చని  నాకు అనిపించింది.. వివిధ రకాలైన సర్పములను నీ ఆభరణాలుగా జేసుకునా పరమశివా …. కైలాసా శిఖరానికి నాలు వైపులా రక్షకులుగా వున్న నాగేశ్వరులని కాంచవయ్యా ఆని…మణిరుచులు అన్నదానికి మణులంటే  ఎంతో ప్రియము కలిగి వాటినే  అభరణాలుగా చేసుకుని ధరించిన  పాములు అని అర్ధమును కూడ తీసుకోవచ్చు అని భావిస్తున్నాను.

నీ తలపైన నీ జటాజూటములనే కమలమున కూర్చుని వున్నది కదా గంగా భవాని!ఆ జటాజూటముల చెంతనే వుంది కదా  నెలవంక..ప్రేమతో వారిని నీ శిరోభూషణములుగా అలంకరించుకుని మరింత రమణీయముగా శోభిస్తున్నావు.నీ శిరస్సుకు భూషణాలుగా వున్న  నెలవంక,గంగా భవానీలు కూడ మరింత సౌందర్యాన్ని సంతరించుకుని లోకాలను రక్షిస్తున్నారు.

మంచి మేలిమైన రత్నపుటుంగరాలు వంటి జటాజూటములతో ,భుజమునకు వున్న పన్నగ కేయురములతో (పాములను భుజ కీర్తులుగా జేసుకున్న)నీవు శోభిస్తూ వుండగా నీ పాలుగారు మోమున వున్న శ్రీకారం ఎల్ల లోకాలను శాసిస్తూ వుండగా పులి తోలు గట్టి త్రిశులపాణీవై పార్వతీ దేవితో కైలాసాన చిద్విలాసముగా కొలువున్న నీకు నా శిరస్సును వంచి వందనములను అర్పిస్తున్నాను.

విష్ణు తత్వము:

జగన్నాధుడైన శ్రీమన్నారాయణుడు దేవ దేవుడై ,కోటి సూర్యుల తేజస్సుతో సమానముగా ప్రకాశిస్తూ కొలువై వున్నాడు.శ్రీ హరి రూప సౌందర్యం ,హృదయ సౌందర్యం విశ్వమంతటా వ్యాపిస్తోంది .. స్త్రీ జన మనస్సులలో నిశ్చలంగా నిలిచి తన హృదయస్థానమున శ్రీదేవిని నిలిపి  వనిత మోహనాంగుడై  మన్మధునికి పగవాడైనాడు.  

చేతులకు సరిగ్గా సరిపోయే కంకణములు ధరించిన స్త్రీలు నీ చుట్టూ వున్నారు…వారిపై నీ చల్లని చూపుల చంద్రకిరణాల కాంతిని ప్రసరించరా! మణిరుచులంటే ఇక్కడ..మణులాది ఐశ్వర్యములు అంటే ఇష్టము కలిగిన ఆడువారు అన్న అర్ధము కూడా వస్తుందని  భావిస్తున్నాను.

ఓ శ్రీ హరీ! నీ తల వైపున శేషుడు ఛత్రమై నిను సేవిస్తున్నాడు.చంద్రసహోదరి అయిన శ్రీదేవి నీకు సతి అయి నీ పాదపద్మములను సేవిస్తున్నది..ఇలా నీ మీదనున్న ప్రేమతో నిను జేరి సేవిస్తున్నారు కదా శ్రీ మహలక్ష్మి దేవి,ఆదిశేషువు.అలాగే నీవు కూడ వారి పట్ల అత్యంత ప్రేమను స్నేహమును చూపుతున్నావు.

మేలిమైన రత్నపుటుంగరాలతో ,భుజాలకు సువర్ణ కేయూరములతో (భుజకీర్తులతో)నీవు శోభిస్తూ వుండగా,పాలు గారే నీ మోమునున్న శ్రీకరం  ఎల్ల లోకాలను శాసిస్తూ వుండగా,చిద్విలాసముతో జీవాత్మలకు అంటిపెట్టుక్కున్న అహంకారమనే  పులి తోలును శంఖ చక్ర గదాయుధుడవై నీ చాకచక్యముతో తీసివేసే ఓ లక్ష్మీనారయణా! నీకు నా శిరసాభివందనములు..  (ఇక్కడ గట్టి అనే పదానికి చాక చక్యము,గట్టితనము,తెలివి వంటి అర్ధాలు కూడా వున్నవి..) 

కొలువై ఉన్నాడే దేవ దేవుడు... శ్రీ వేంకటేశ్వరుడు!
కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు కాపాడే కమలాపతి

కొలువై ఉన్నాడే దేవ దేవుడు... శంకరుడు
అమృతం చిలికే నీలకంఠుడుకాపాడే ఉమా పతి



Post a Comment

0 Comments