రీసెంట్ గా మాకు తెలిసిన ఒక ఆంటీ గారు చనిపోయారు ఫ్రెండ్స్ . ఆమె వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చు.

అంకుల్ గారు చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది.
ఆంటీ గారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.
ఆమె ఎవరి ఇంటి దగ్గర ఉండే వారు కాదు.
ఆమె సొంత ఇంట్లోనే ఉంటూ ఆమె వండుకొని తింటూ ఉండే వారు.
ఇటీవల కాలంలో ఆమెకు వాంతులు విరోచనాలు అయ్యి ఇంటి వద్దనే చనిపోయారు.😥
కొడుకులు గాని ,కోడలు గాని, కూతురు గాని ,అల్లుడు గాని ఎవరు ఆమెను హాస్పిటల్కి తీసుకొని వెళ్లలేదు.
వాంతులే కదా అని చెప్పి టాబ్లెట్ తెచ్చి వేశారంట అంత కేరింగ్ కూడా తీసుకోలేదు.
మళ్లీ అందరూ చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లే.
ఆంటీ గారు చనిపోయారని సంగతి తెలియగానే... వాళ్ళ మూడో కోడలు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందంట.
హుటాహుటిన వచ్చి ఆంటీ గారి ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి దాసేసిందంట.
కూతురుకి తెలిసి హుటాహుటిన వచ్చి ఆంటీ గారి బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయో ఆమెకు తెలుసు అంట.
శవం బయట ఉండగానే.... బీరువా తాళాలు తీసి అందులో ఉన్న డబ్బు అంతా తీసి దాసేసుకుందంట
మిగతా ఇద్దరు కోడళ్ళు ఆమె ఒంటి మీద బంగారం గురించి ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఏమైపోయాయి అని ఆంటీ గారి శవాన్ని బయట పెట్టుకొని గొడవలు అంట.
ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి ఒక పక్కన ఆమె చనిపోతే మీరేంటి ఇలా గొడవలు పడుతున్నారు అని తిట్టి ఆరోజు చేయవలసిన తథంగాలన్నీ చేయించారంట.
11వ రోజున మాత్రం పెద్దకర్మ రోజున అంగరంగ వైభవంగా వాళ్ళ చుట్టాలను ఇరుగుపొరుగు వాళ్లను అందరిని పిలిచి చాలా గ్రాండ్ గా పెద్ద కర్మను చేశారంట.
అదే రోజున ఆమెకు నచ్చిన వంటకాలన్నీ ఫోటో ముందల పెట్టారంట.
బ్రతికున్నప్పుడు కూతురుగాని,కోడళ్ళు గాని ఏ రోజు ఆమెకు ఒక ముద్ద అన్నం పెట్టింది లేదంట.
అంత వయసులో కూడా ఆమె ఒక్కరే వండుకొని తినేదంట. కొడుకులు కూడా మాకు ఆస్తులు ఎప్పుడు పంచుతావు అని చెప్పి అడగడానికి వచ్చేవారంట.
తల్లి బాగోగులు పట్టించుకునే వారు కాదంట.
అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఫ్రెండ్స్.
మనుషులు డబ్బు కోసం ఎంత స్వార్ధంగా మారిపోతున్నారంటే.... ఆఖరికి చనిపోయిన వాళ్ళను కూడా వదలడం లేదు.
ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయింది అంటే... ఆ మనిషి శాశ్వతంగా ఇక మనకు కనిపించరు అని అర్థం.
అప్పటివరకు బ్రతికి ఉన్న మనిషి శవంగా మారిపోయేసరికి ఎలాంటి వారమైన ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తాం.
అలాంటిది.... డబ్బు కోసం ఎంత దిగజారిపోయి బ్రతుకుతున్నారంటే.... బంధాలు అనుబంధాలు అన్నిటిని తుంచేస్తున్నారు.
ఒక మనిషి చనిపోతే పోయిందిలే అని ఈజీగా తోసి పడేస్తున్నారు.
డబ్బు కోసం దేనికైనా దిగజారిపోయి బ్రతికేస్తున్నారు.
చనిపోయారు అనే జాలి కూడా లేకుండా పాపాలను మూటకట్టుకుంటున్నారు.
బ్రతికున్నప్పుడు ఒక ముద్ద కూడా అన్నం పెట్టకుండా చనిపోయిన తర్వాత ఫోటోలకి రకరకాల ఆహార పదార్థాలు పెట్టి అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తానికి తెలిసేలా గొప్పలకు పోయి ప్రవర్తిస్తున్నారు.
ఇప్పటి మనుషులకు ప్రేమ అనేది గుండెల నుంచి కాకుండా డబ్బు నుంచి పుట్టుకుని వస్తుంది.
ఒకటి మాత్రం పచ్చి నిజం ఫ్రెండ్స్.
ఏ ఇంట్లో అయితే వృద్దులు బాధలు పడతారో.... ఆ ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఇల్లు ఎదగదు.
ఆ ఇంట్లో మనుషులు కూడా అలాగే ఉంటారు. చాలా కష్టాలు పాలవుతారు.
కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు.
ఒకప్పుడు చేసిన పాపాలు ఎప్పటికోగానే అనుభవించేవారు కాదు.
కానీ ఇప్పుడు వెంటనే తగులుతుంది.
బ్రతికి ఉండగానే కర్మను అనుభవించే తీరాలి.
తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఏది ఆశించకండి.
వాళ్ళు ఇస్తేనే తీసుకోండి. డిమాండ్ చేయకండి. బలవంతంగా అంతకంటే లాక్కోకండి.
వాళ్లు మనకు జన్మన ఇచ్చి బ్రతుకును ఇవ్వడమే చాలా గొప్ప విషయం.
తల్లితండ్రులను ప్రేమించండి .అంతేగాని వాళ్ళు సంపాదించే ఆస్తులను కాదు.
బంధాలు అనుబంధాలు విలువలను తెలుసుకోండి.
May be an image of 1 person, smiling and text that says 'Padma Nammi'
All reactions:
1K
246 comments
152 shares
Like
Comment
Share

Post a Comment

0 Comments