గోమాత మహత్యం గో పూజ ఫలితాలు :::

గోమాత మహత్యం గో పూజ ఫలితాలు :::

గోమాత మహత్యం గురించి శివుడు పార్వతిదేవికి చేప్పిన మాటలు.

*గోవును పూజించిన సర్వపాపములు నశించును… గోమాత నందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా…?*

ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ఈ విధంగా చెప్పాడు .

" ఓ పార్వతీ! గోమాత నందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును. ఆ గోమాత పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును.
ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. 

గోమాత ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.

కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. 

గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును.

గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. 

ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.

నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవచ
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ||

గావోమమాగ్రతః సంతుగావోమే సంతుపృష్టతః
గావోమే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం||
 
సర్వదేవమయేదేవి సర్వ దేవైరలంకృతే
మాతర్నమాభిలషితం సఫలంకురువందిని||

దేవేంద్రుని భార్య శచీదేవి.
బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి.
శ్రీమన్నారాయణుని భార్య లక్షీదేవి.
శ్రీరాములవారి భార్య సీతాదేవి.
శ్రీ కృష్ణుల వారి భార్య రుక్మిణిదేవి.
పరమేశ్వరుని భార్య పార్వతీదేవి.
వశిష్టుల వారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతఃకాలమున లేచి ఆడవారు చేసిన పాపముల ఎలాగును పోవును కృష్నా?అని అడిగినారు.

ప్రొద్దుటే లేచి గోవు మహాత్యము పటించుకుంటే సకల పాపములు పోవును.అంటు కలిపిన పాపము,ముట్టు కలిపిన పాపము,బంగారము దొంగిలించిన పాపము,ఎరిగీ ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము అగును.

మధ్యాహ్నకాలమందు పటిస్తే ఏమిటి కృష్నా!అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు,జన్మాంతరం అయిదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు.

అర్దరాత్రివేళ పటిస్తే ఏమిటి కృష్ణా! అంటే యమభాధలు పడబోరు,యమకింకరులు చూడబోరు.గోవు మాహాత్మ్యం పటించిన ఫలితం వస్తుంది.

" శ్రీ కృష్ణ పరమాత్మ ” గోవును ఎంతో భక్తి తో శ్రద్ధ తో సేవకుడిగా చూసుకొనే వాడు. 

|| గోమాత గొప్పదనం ||

ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం .

ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.

పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా కొద్ది రోజులలో పుండు నయమైపోతుంది . 

ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది .

మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.

ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.

వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో  నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. 

ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.

ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.

ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి .

 ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి .

ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు .

ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది.

పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది 
అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని .

ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది. 

దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు .

ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది .

పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు .

ఇవన్ని మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించినవి కాబట్టి. అదే ఇంగ్లీషు మందులు తగ్గుతాయో లేదో అనే ఆలోచన కూడా మనకి రాదు. మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యావిధానం .

గోమాత మహాత్మ్యం  :

ఏ శుభకార్యమైనా గోమాత సంబంధం లేక పూర్తి కాదు. ఉదాహరణకు ”గృహప్రవేశం చేసుకుంటే, ఆ కొత్త ఇంట్లో ముందుగా గోమాతను ప్రవేశపెడతారు. 

జీవ్ఞలను తరింపజేసే దివ్యఔషధశాల గోమాత! గోవ్ఞ పంచగవ్యప్రాసనం ”కేన్సర్‌ని నివారిస్తుందట! ”గోశాలలు, గోష్ఠములు సకలవ్యాధి నిరోధక స్థానములని, గోమూత్రం, గోమయం, పిడకల పొగ, ప్లేగు వంటి భయంకర వ్యాధి క్రిములను నశింపజేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

గోమాత ”అంబారవం వల్ల కాలుష్యం నివారింపబడుతుందట. ఆమె వేదమాతృస్వరూపిణి; లోకపావని, సంతానం కోసం పరితపిస్తున్న దిలీపమహారాజుకి గోమాతను సేవిస్తే కోరిక తీరుతుందని సలహా ఇచ్చాడట వశిష్ట మహర్షి గోవు, గోవిందునికి ప్రియమైనది కాబట్టి రోజూ నమస్కరిస్తే, శుభం కలుగుతుందని చెప్పాడట. ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అన్నీ శ్రేయోదాయకాలే! గోవ్ఞలను సేవించే ప్రాంతాల్లో అతివృష్ఠి, అనావృష్ఠి ఉండవని పురాణాలు, శాస్త్రాలు తెలుపుతున్నాయి. 

ఆవు నెయ్యి అగ్నిపై వేస్తే వచ్చే పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందట. యజ్ఞయాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుండి రక్షణ లభిస్తుంది.
ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ఆక్సిజన్‌ లభిస్తుందట. 

ఆవు పాలలో అటమిక్‌ రేడియేషన్‌ నుండి రక్షణ పొందగల శక్తి లభిస్తుందని రష్యా శాస్త్రవేత్త శిరోవిద్‌ పేర్కొన్నారు. గోమాత వెన్నెముకలో సూర్యకేతునాడి ఉంటుందని, సూర్యుని ప్రకాశంతో చేతన పొందిన ఆ నాడి, ఒక పచ్చని పదార్థాన్ని విడుదల చేస్తుందని, దాన్నే గోరోజనం అంటారు. దాంట్లో విషాన్ని హరించే శక్తి ఉందని అంటారు.

ఆ పదార్థం వల్లనే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. ఒకప్పడు భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే రుషులు వేడుకోగా, దేవతలు సురభిని భూమిపైకి పంపారట! ఆమె సంతానమే గోవులని పురాణాల వల్ల తెలుస్తోంది. 

గోవుకి సాటియైనది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తూ లక్ష్మీస్వరూపిణిగా భావిస్తారు. ధర్మ,అర్థ, కామ, మోక్షములు ఆవు పొదుగు నాలుగు స్థానాల్లోనూ ఉన్నట్లుగా సంత్‌ తులసీదాసు వర్ణించారు. సంత్‌ మహాదేవ్‌ ఢిల్లీ నవాబు కోరగా, చనిపోయిన ఆవ్ఞను బ్రతికించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడట.

సిక్కుల గురువు గోవింద్‌ సింహ్‌ చండీదీవార్‌లో గోరక్షణకై దుర్గాభవాని దీవనలు పొందాడు. జైనులు కూడా గోవును చంపడం మహాపాప మని నమ్ముతారు. 

మహావీరుడు మనుజుల కన్నా రక్షణ మిన్న అన్నాడు గోవును చంపడం మనిషిని చంపడమే అన్నాడు.. శ్రీబాలగంగాధర తిలక్‌ గోవధను నిషేధించారు . 

 శ్రీకృష్ణుడు ఇంద్రపూజను మాన్పించి గోపూజను చేయించగా, ఇంద్రుడికి కోపం వచ్చి, ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిపించాడట. కృష్ణుడు తన చిటకెన వ్రేలుపై గోవర్ధనగిరిని ఏడురోజుల పాటు ఎత్తిపట్టుకొని, గోవులను, దూడలను, గోపీజనాన్ని రక్షించాడట.

”భా అంటే ”తేజస్సు. తేజస్సును ఆరాధించేవారే ”భారతీయులు. నక్షత్ర, గ్రహ తారాదుల దివ్యకిరణ ప్రతిరూపాలే గోవ్ఞలు. కాబట్టి గోపూజ చాలా శ్రేష్ఠమైనది.

గోమాత గాయత్రి మంత్రం: 

"ఓం శుభకామాయై విద్మహే కామధాత్రే చ ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్". 

ఈ మంత్రం గోమాతను, అంటే కామధేనువుని స్తుతిస్తుంది. దీనిని పఠించడం వలన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 
మంత్రం యొక్క అర్థం: "ఓం, మేము శుభాన్ని కోరేవారిని, కోరికలను తీర్చేవారిని తెలుసుకుందాం, ఆ గోమాత మమ్మల్ని ప్రేరేపించుగాక" అని ఈ మంత్రం యొక్క భావం,  

పఠించే సమయం:

ఈ మంత్రాన్ని సాయంకాలం లేదా శుక్రవారం రోజున పఠించడం శుభప్రదమని భావిస్తారు. ఎన్నిసార్లు పఠించాలనే విషయంలో 3, 6, 9, 11, 33, 108 లేదా 1008 సార్లు పఠించవచ్చను .

గోమాత ప్రాముఖ్యత: హిందూ సంప్రదాయంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు. ఇది కామధేనువుగా, అంటే కోరికలను తీర్చే తల్లిగా కొలుస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు,

|| జై గోమాత జై జై గోమాత  ||

🕉️ ఓం నమశ్శివాయ ||

|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||

🔱 జై మహాకాల్ ||

🔱 జై మహాకాళి ||

🔯 ఓం శ్రీ మాత్రే నమః ||🙏🙏🙏

Post a Comment

0 Comments